Teachers: జీవో 317తో నష్టపోయిన టీచర్లను జిల్లాలకు పంపాలి
పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రెండు రోజుల సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భట్టాపురం మోహన్‌రెడ్డి, పూల రవీందర్, తదితరులు పాల్గొన్నారు . చదవండి: Teach Tool Training : ఈనెల 18 నుంచి టీచ్ టూల్ శిక్షణ ప్రారంభం..
సమావేశ తీర్మానాలు ఇలా...
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని కోరారు.
పీఆర్సీలో 2023 నుంచి ఆర్థిక లాభం వచ్చే విధంగా 50 శాతం ఫిట్‌మెంట్ వర్తింపజేయాలని, సర్వీస్ రూల్స్ వెంటనే ఇప్పించాలని వెల్లడించారు. గతంలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు పీఎస్‌హెచ్‌ఎం సంఖ్యను పదివేలకు పెంచాలని, జీవో ఎంఎస్ 11,12 సవరిస్తూ బీఈడీ అర్హత ఉపాధ్యాయులకు పీఎస్‌హెచ్‌ఎంగా పదోన్నతికి అవకాశం కల్పించాలని కోరారు.