Free Education: విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయం’
ఎమ్మిగనూరు: బసవాసి జవహర్ నవోదయ విద్యాలయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అప్పట్లో దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసిలో ఈ విద్యాలయాన్ని నిర్మించారు. ఈ విద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 10లోగా ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. 2024 జనవరి 20న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఉత్తమ విద్యాబోధన..
జవహర్ నవోదయ విద్యాలయంలో ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీయటంతోపాటు సమైక్యతాభావాన్ని పెంపొందిస్తున్నారు. ప్రతియేటా నవోదయలో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహిస్తారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతి ప్రవేశ పరీక్షల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 80 సీట్లకు విద్యార్థులు పోటీ పడాల్సి ఉంటుంది.
Students: తరగతి గది విద్యార్థి భవిష్యత్‌కు పునాది
అర్హతలు ఇవే..
నవోదయ విద్యాలయాలల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఒక్కసారి మాత్రమే రాయాల్సి ఉంటుంది. కర్నూలు ,నంద్యాల జిల్లాల్లోని అన్ని మండలాల్లో 5వ తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. 2024–25 విద్యాసంవత్సరం కోసం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు 2012 మే 1వ తేదీ నుంచి 2014 జూలై 30 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4 తరగతులు పూర్తి చేసి ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలి. గతంలో ప్రవేశపరీక్షకు హాజరైన వారు అనర్హులు.
రిజర్వేషన్లు ఇలా..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణాల్లోని పాఠశాలల్లో విద్యనభ్యసించే బాలబాలికలకు 25శాతం సీట్లు కేటాయిస్తారు. బాలికలకు 33 శాతం కోటా అమలులో ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలకు 15శాతం, షెడ్యూల్డ్ తరగతులకు 7 శాతం, దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష కోసం తమ పాఠశాలల్లో విద్యాబోధనతోపాటు కోచింగ్ సెంటర్‌లలో ప్రత్యేక శిక్షణ తీసుకొంటుంటారు. కష్టపడి చదివిన వారికే తప్పక సీట్లు వస్తాయి.
ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు
దరఖాస్తులను ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖాధికారుల కార్యలయాలు, ఏపీ సమగ్ర శిక్షణా కార్యాలయల్లో పొందవచ్చు. ఆన్‌లైన్‌లో జవహర్ నవోదయ వెబ్‌సైట్( జ్ట్టిఞట:// ఛిఛట్ఛజ్టీఝట. టఛిజీ. జౌఠి. జీుఽ/ ుఽఠిట/)లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈనెల 10లోగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
Career Opportunities: ఈ కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు
ప్రవేశ పరీక్ష ఇలా ఉంటుంది..
నిర్దేశించిన పరీక్ష కేంద్రాల్లో 2024 జనవరి 20 వతేదీ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఒకదాన్ని విద్యార్థుల ఎంపిక చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో 100మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ చాయిస్ ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్షలో మూడు విభాగాల కింద ప్రశ్నలు ఉంటాయి. మేధాశక్తిపై 50 , తెలుగు, గణితం విభాగాల్లో ఒక్కోదానికి 25 చొప్పున 50 ప్రశ్నలు ఉంటాయి. ఎంపిక విధానం పారదర్శకంగా ఉంటుంది. పరీక్ష పత్రాల రూపకల్పన, విద్యార్థుల ఎంపిక మొత్తం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. ఎంపికై న విద్యార్థులకు 6,7 తరగతులను తెలుగు,ఇంగ్లిష్ మీడియాల్లో బోధిస్తారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకూ సీబీఎస్‌ఈ పద్ధతిలో ఇంగ్లిష్‌లో మాత్రమే బోధన ఉంటుంది.