Collector Sree Harsha: టీచర్లను మందలించిన కలెక్టర్
ఆగస్టు 3న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మారని టీచర్ల తీరు’ కథనానికి కలెక్టర్ స్పందించారు. దామరగిద్ద మండలం వత్తుగుండ్లతండాలో పనిచేస్తున్న హెచ్‌ఎం వికాస్, ఉపాధ్యాయుడు వెంకటేష్‌కు డీఈఓ కార్యాలయం నుంచి మెమో జారీ చేయమని ఆదేశించడంతో, ఆగస్టు 3న వారికి కాంప్లెక్స్ హెచ్‌ఎం బాలాజీ అందించారు. అదేవిధంగా సాయంత్రం తన కార్యాలయానికి సదరు టీచర్లను పిలిపించిన కలెక్టర్ వారిని తీవ్రస్థాయిలో మందలించారు.
చదవండి: Teachers Problems: PRTUతోనే సమస్యలు పరిష్కారం
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఇక నుంచి పాఠశాలలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని హెచ్చరించారు. అలాగే ‘ఆడిట్ పేరుతో పాఠశాలకు డుమ్మా’ శీర్షికన ‘సాక్షి’లో ఆగస్టు 3న ప్రచురితమైన కథనం విషయమై సెక్టోరియల్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. టీచర్లు పాఠశాలలకు రెగ్యులర్‌గా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వెలుగు అభ్యాసదీపిక సమర్థవంతంగా అమలు చేసేలా డీఆర్‌పీల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు.