Admissions at KGBV: కేజీబీవీ పాఠశాలలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానం
వీరఘట్టం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల్లోంచి పుట్టినదే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం. నేడు కేజీబీవీలు బాలికా విద్యకు సోపానాలుగా నిలుస్తున్నాయి. ఆడపిల్లల చదువుకు పెద్దపీట వేస్తూ ఆనాడు నెలకొల్పిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికల ఉజ్వల భవిష్యత్‌కు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం కేజీబీవీలో సీటు సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ సీటు కోసం మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా సిఫార్సులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ సీటుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Telangana TRT & DSC 2024 Notification: 11,062 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే రెసిడెన్షియల్ విద్యను అందిస్తుండడంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కేజీబీవీల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2024–25 విద్యా సంవత్సరంలో కేజీబీవీలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ప్రవేశాలు చేపట్టేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటితో పాటు 7,8,9 తరగతుల్లో మిగులు సీట్లు కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 12 నుంచి ఏప్రిల్ 11 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కేజీబీవీలో చేరేందుకు ఆనాథలు, బడి బయట చిన్నారులు, బడి మధ్యలో మానేసిన బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
SSC CPO Notification 2024: కేంద్ర సాయుధ దళాల్లో 4,187 ఎస్‌ఐ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
జిల్లాలో ఇదీ పరిస్థితి
పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం, సీతంపేట, భామిని, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస, జీఎల్.పురం, పార్వతీపురం, సాలూరు, కొమరాడ, బలిజిపేట, మక్కువ, సీతానగరం, పాచిపెంట మండలాల్లో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి కేజీబీవీలో 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో 40 సీట్లు చొప్పున జిల్లా వ్యాప్తంగా అన్ని కేజీబీవీల్లో 6వ తరగతిలో 560 మంది బాలికలకు, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో 560 సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Students Achievement: బ్యాగ్‌పైప్ బ్యాండ్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న విద్యార్థులు
అలాగే 7వ తరగతిలో 16 సీట్లు, 8వ తరగతిలో 21 సీట్లు, 9వ తరగతిలో 10 మిగులు సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 3,153 మంది బాలికలు ఈ ఏడాది విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది టెన్త్‌లో 79 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఇలా కేజీబీవీలు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ దినదినాభివృద్ధి చెందుతుండడంతో కేజీబీవీల్లో చదివేందుకు ఎక్కువ మంది బాలికలు ఇష్టపడుతుండడంతో సీట్లకు డిమాండ్ పెరిగింది.
10th Public Exams 2024: ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు
చేరేందుకు కావాల్సిన పత్రాలు
కేజీబీవీలో చేరేందుకు బాలికలు దరఖాస్తు చేసుకునేందుకు బాలికతో పాటు తల్లిదండ్రుల ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, స్టడీ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ ఫొటోతో పాటు ఫోన్ నంబర్ ఉంటే apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఆర్టీఈ టోల్‌ఫ్రీ నంబర్ 18004258599 నంబర్‌ను సంప్రదించవచ్చు.
APRJC CET 2024 Notification: ఏపీఆర్‌జేసీ సెట్ 2024 నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇలా..
ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం
కేజీబీవీల్లో బాలికలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన మొదటి ఏడాదే టెన్త్‌లో 79 శాతం ఫలితాలు సాధించాం. అలాగే మహిళా టీచర్ల పర్యవేక్షణలో బాలికలకు రెసిడెన్షియల్ విద్యను అందిస్తుండడంతో కేజీబీవీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో చేరేందుకు ఈనెల 12 నుంచి ఏప్రిల్ 11వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. బయట నెట్ సెంటర్లలో ఆన్‌లైన్ చేయవచ్చు లేదా దగ్గరలో ఉన్న కేజీబీవీకి వెళ్లినా దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
– కర్రి రోజారమణి, జీసీడీఓ, పార్వతీపురం మన్యం జిల్లా
Tags
- KGBV School
- admissions
- online applications
- girls school
- students education
- Education Schemes
- notification for KGBV admissions
- registrations
- Education News
- Sakshi Education News
- GovernmentOrder
- EducationOpportunity
- GirlsEmpowerment
- QualityEducation
- InclusiveLearning
- KGBVschool
- achievement
- FacilitiesAvailable
- SakshiEducationUpdates