Yoga Competitions: విద్యార్థి దశ నుంచి యోగా చేయాలి
Sakshi Education
నిజామాబాద్ సిటీ: విద్యార్థి దశనుంచే యోగా అలవాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి సూచించారు.
జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్
జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి గంగాస్థాన్‌లో జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగాయి. ఉదయం ఆర్మూర్ ఆర్‌డీవో వినోద్‌కుమార్ పోటీలను ప్రారంభించగా ముగింపు కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ హాజరై విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. రోటరీ క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించటం ఎంతో సంతోషకరమని క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌రావు అన్నారు. పోటీల్లో 140 మంది విద్యార్థులు పాల్గొనగా మొత్తం 30 మంది విజేతలకు బహుమతులు అందజేశారు.