Skip to main content

BHEL Recruitment 2024: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎ­ల్‌)..వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in BHEL   BHEL  recruitment   Apply for BHEL positions  BHEL employment opportunities

మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: సీనియర్‌ ఇంజనీర్‌/ఈ2-19, డిప్యూటీ మేనేజర్‌/ఈ3-10, సీనియర్‌ మేనేజర్‌/ఈ5-04.
విభాగాలు: పవర్‌ ఎలక్ట్రానిక్స్, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌(మెకానికల్‌), సిస్టమ్‌ ఆర్కిటెక్ట్, సీఈ మాడ్యుల్‌ డెవలప్‌మెంట్, సీఈ మోడల్‌ బేస్డ్‌ ఎంబెడెడ్, పవర్‌ మాడ్యుల్‌ (మెకానికల్‌), ట్రాన్స్‌పోర్టేషన్, బ్యాటరీ ప్యాక్‌ డెవలప్‌మెంట్, బ్యాటరీ బీఎంఎస్‌ డెవలప్‌మెంట్, ఏసీసీ సెల్‌ డిజైన్‌ డెవలప్‌మెంట్, నావల్‌ కంట్రోల్‌ సిస్టమ్స్, యాక్టివ్‌ ప్రొటక్షన్‌ సిస్టమ్, నావల్‌ బ్యాటరీ ప్యాకేజింగ్‌.
అర్హత: బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రికల్‌), మెకానికల్‌ ఇంజనీరింగ్‌ /ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 01.03.2024 నాటికి సీనియర్‌ ఇంజనీర్‌కు 32 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 36 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు ఉండాలి.
వేతనం: సీనియర్‌ ఇంజనీర్‌(ఈ2)కు రూ.­70,000 నుంచి రూ.2,00,000, డిప్యూటీ 
మేనేజర్‌(ఈ3)కు రూ.80,000 నుంచి రూ.2,20,000, సీనియర్‌ మేనేజర్‌(ఈ5)కు రూ. 1,00,000 నుంచి రూ.2,60,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తును నింపి అవసరమైన జిరాక్స్‌ కాపీలను జతచేసి పోస్ట్‌ బాక్స్‌ నెం.3842, బీహెచ్‌ఈఎల్‌ హౌస్, సిరిఫోర్ట్, న్యూఢిల్లీ-110049 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024.
దరఖాస్తు కాపీని పంపడానికి చివరితేది: 03.04.2024.

వెబ్‌సైట్‌: https://careers.bhel.in/ or https://www.bhel.com/

చదవండి: Engineer Jobs in NTPC: ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ లో 63 ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Mar 2024 05:59PM

Photo Stories