Admissions in PDEU-SPM: పీడీఈయూ–ఎస్‌పీఎం, గాంధీనగర్‌లో ఎంబీఏ ప్రవేశాలు..
గాంధీనగర్(గుజరాత్)లోని పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ(పీడీఈయూ) –స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్‌మెంట్(ఎస్‌పీఎం) 2022–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: రెండేళ్లు
విభాగాలు: ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, జనరల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్(మైనర్).
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. క్యాట్ 2021/గ్జాట్ 2022/ఎన్‌మ్యాట్ 2021 అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: క్యాట్/గ్జాట్/ఎన్‌మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, రిటన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం, అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06.02.2022
వెబ్‌సైట్: http://www.spm.pdpu.ac.in/
చదవండి: Admissions in NIT Rourkela: నిట్, రూర్కెలాలో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..