Skip to main content

M.Sc & Ph.D Admissions: డా.వై.ఎస్‌.ఆర్‌.హార్టికల్చరల్‌ యూనివర్శిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డా.వై.ఎస్‌.ఆర్‌.హార్టికల్చరల్‌ యూనివర్శిటీ.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి హార్టికల్చర్‌ విభాగాల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Dr. YSR Horticultural University

కోర్సుల వివరాలు
ఎంఎస్సీ(హార్టికల్చర్‌): రెండేళ్ల కాల వ్యవధి. 
సీట్ల సంఖ్య: 57; 
విభాగాలు: ఫ్రూట్‌ సైన్స్, వెజిటబుల్‌ సైన్స్, ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్‌-ఏరోమాటిక్‌ క్రాప్స్, పోస్ట్‌ హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్, ప్లాంట్‌ పాథాలజీ, ఎంటమాలజీ. 
అర్హత: బీఎస్సీ(హార్టికల్చర్‌)/బీఎస్సీ(ఆనర్స్‌) హార్టికల్చర్‌.

పీహెచ్‌డీ(హార్టికల్చర్‌): మూడేళ్ల కాల వ్యవధి. 
సీట్ల సంఖ్య: 24; 
విభాగాలు: ఫ్రూట్‌ సైన్స్, వెజిటబుల్‌ సైన్స్, ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్‌-ఆరోమాటిక్‌ క్రాప్స్, పోస్ట్‌ హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్, ప్లాంట్‌ పాథాలజీ, ఎంటమాలజీ. 
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 40 ఏళ్లు మించకూడదు.

కోర్సు అందించే కళాశాలలు: కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌(వెంకటరామన్నగూడెం), కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌(అనంతరాజుపేట).

ఎంపిక విధానం: ఐసీఏఆర్‌ ఏఐఈఈఏ(పీజీ)-2022, ఐసీఏఆర్‌ ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ)-2022 సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌ డా.వై. ఎస్‌.ఆర్‌. హార్టికల్చరల్‌ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, వెంకటరామన్నగూడెం, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.12.2022
కౌన్సిలింగ్‌ తేది: ఎంఎస్సీ-09.01.2023, పీహెచ్‌డీ-10.01.2023.
వేదిక: కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.

వెబ్‌సైట్‌: https://drysrhu.ap.gov.in/

Admissions in NIT Puducherry: నిట్, పుదుచ్చేరిలో పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Last Date

Photo Stories