Skip to main content

PG/PhD Admissions: ఐఐఎస్సీ, బెంగళూరులో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

IISC Bangalore

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ)..2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లు(పీహెచ్‌డీ/ఎంటెక్‌(రీసెర్చ్‌): 
విభాగాలు: ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ గేట్‌/నెట్‌ అర్హత ఉండాలి.

ఇంజనీరింగ్‌ కోర్సులు(ఎంటెక్‌/ఎండిజైన్‌/ఎంమేనేజ్‌మెంట్‌): 
విభాగాలు: ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్, బయోఇంజనీరింగ్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌ /టెక్నాలజీ/డిజైన్‌/ఆర్కిటెక్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ గేట్‌/సీడ్‌ 2022 స్కోర్‌ ఉండాలి.

సైన్స్‌ కోర్సులు: 
విభాగాలు: లైఫ్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. జామ్‌ 2022/వాలిడ్‌ గేట్‌ అర్హత ఉండాలి.

ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులు: 
విభాగాలు: బయలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్,మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. జామ్‌/జస్ట్‌ 2022 అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌/నెట్‌/జామ్‌ అర్హత పరీక్షల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని రాతపరీక్ష/గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.03.2022

వెబ్‌సైట్‌: https://www.iisc.ac.in

​​​​​​​
చ‌ద‌వండి: Admission in NEST: నెస్ట్‌–ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Last Date

Photo Stories