Skip to main content

C-CAT 2022: సీడాక్‌లో జాబ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్స్‌ కోసం నోటిఫికేషన్ విడుద‌ల‌.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

CDAC C-CAT 2022
  • సీడ్యాక్‌లో జాబ్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామ్స్‌
  • బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ అభ్యర్థులకు అవకాశం 
  • సీ–క్యాట్‌లో స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడాక్‌) లో జాబ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్స్‌ కోసం సీ–క్యాట్‌కు నోటిఫికేషన్‌ వెలువడింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. బీఈ /బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ పూర్తిచేసిన అభ్యర్థులు సీ–క్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సీడాక్‌
రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ 1988లో సీడాక్‌ను ప్రారంభించింది. కంప్యూటింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, గ్రిడ్, మల్టీ లింగ్వల్‌ కంప్యూటింగ్, ప్రొఫెషనల్‌ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్, సైబర్‌ సెక్యూరిటీ, హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ తదితర విభాగాల్లో దేశ విదేశాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

కోర్సులు–అర్హతలు

  • పీజీ డిప్లొమా: బీఈ/బీటెక్‌/నాలుగేళ్ల బీఎస్సీ ఇంజనీరింగ్‌ లేదా డీవోఈఏసీసీ బీ లెవల్‌ ఇన్‌ ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లేదా పీజీ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌ సైన్సెస్‌(ఎమ్మెస్సీ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ వంటివి)తో పాటు ఇంటర్‌లో మ్యాథమెటిక్స్‌ చదివి ఉండాలి.
  • పీజీ డిప్లొమా ఇన్‌ జియోఇన్ఫర్మేటిక్స్‌:అర్హతలు: పైన తెలిపిన అర్హతలు లేదా పీజీ ఇన్‌ అప్లయిడ్‌ సైన్సెస్, జాగ్రఫీ, జియాలజీ, ఫిజిక్స్, కంప్యూటేషనల్‌ సైన్సెస్, మ్యాథ్స్‌ లేదా సంబంధిత విభాగాల్లో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • పీజీ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌: అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలు లేదా ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌ లేదా ఎంసీఏ/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • పీజీడీ ఇన్‌ బిగ్‌డేటా అనలిటిక్స్‌: అర్హతలు: ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌ లేదా ఎంసీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
  • పీజీడీ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా ఇంజనీరింగ్‌ డిగ్రీ/ఎంసీఏ/పీజీ(ఫిజిక్స్‌/మ్యాథ్స్‌/స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణత ఉండాలి.
  • పీజీడీ ఇన్‌ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్‌ అండ్‌ సెక్యూరిటీ: అర్హతలు: కనీసం 55శాతం మార్కులతో పైన పేర్కొన్న కామన్‌ ఎలిజిబిలిటీ లేదా పీజీలో మ్యాథ్స్‌/స్టాటిస్టిక్స్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • పీజీడీ ఇన్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, పీజీడీ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ సెక్యూర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌: అర్హతలు: ఈ రెండు కోర్సులకు పైన పేర్కొన్న కామన్‌ ఎలిజిబిలిటీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఎంబడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్, పీజీ డిప్లొమా వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, పీజీ డిప్లొమా ఇన్‌ రోబోటిక్స్‌ అండ్‌ అలైడ్‌ టెక్నాలజీస్‌: అర్హతలు: పై మూడు కోర్సులకు కామన్‌ ఎలిజిబిలిటీ లేదా బీఈ/బీటెక్‌ ఇన్‌ మెకట్రానిక్స్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సా«ధించి ఉండాలి.
  • పీజీ డిప్లొమా కోర్సులకు ఎటువంటి వయోపరిమితి నిబంధన లేదు. 2021లో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తుకు అర్హులే.

ఎంపిక విధానం
సీడాక్‌ నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీ–క్యాట్‌)ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

పరీక్ష విధానం
సీ–క్యాట్‌ను సీబీటీ(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు. దీనిలో మొత్తం మూడు సెక్షన్‌లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు పరీక్ష సమయం ఒక గంట కేటాయిస్తారు. అభ్యర్థులు ఎంపిక చేసుకునే ఆప్షన్‌ గ్రూప్‌నకు అనుగుణంగా సంబంధిత విభాగంలో పరీక్షను నిర్వహిస్తారు. 

సీడాక్‌ క్యాంపస్‌లు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబై,నవీ ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, పాట్నా, పుణె,సిల్చార్,తిరువనంతపురంల్లో సీడ్యాక్‌కు క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు సీడాక్‌ ఆ«థరైజ్డ్‌ సెంటర్లలో కూడా ఈ కోర్సులను అందిస్తున్నారు.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 13.01.2022
  • సీక్యాట్‌ పరీక్ష తేదీ: 2022 జనవరి 22, 23
  • వెబ్‌సైట్‌: https://cdac.in

చ‌ద‌వండి:  Admission in C-DAC: సీ–డ్యాక్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories