తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్స్‌లో ఆరో తరగతి, ఇంటర్ 2021 ప్రవేశాలు
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఈఐఎస్ సొసైటీలకు చెందిన టీఎస్‌డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్, అశోక్‌నగర్ (వరంగల్).. 2021–22 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి బాలుర నుంచి మాత్రమే దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 7, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.tswreis.in or https://tgtwgurukulam.telangana.gov.in
- ఆరో తరగతి ప్రవేశాలు
అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి పూర్తిచేసిన బాలురు అర్హులు. వార్షికాదాయం పట్టణాల్లో రూ.2,00,000; గ్రామాల్లో రూ.1,50,000 మించకూడదు. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 31.08.2021 నాటికి 11ఏళ్లు మించకూడదు. 31.08.2010 తర్వాత జన్మించి ఉండాలి.
- ఇంటర్మీడియట్ ప్రవేశాలు
అర్హత: 2020–21 విద్యా సంవత్సరానికి పదో తరగతి ఉత్తీర్ణులైన/హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. వార్షికాదాయం పట్టణాల్లో రూ.2,00,000, గ్రామాల్లో 1,50,000 మించకూడదు. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 31.08.2021 నాటికి 16 ఏళ్లు మించకూడదు.