Skip to main content

సీడీఎఫ్‌డీ–రీసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌–2021.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 30..

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ).. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి రీసెర్చ్‌ స్కాలర్‌ ప్రోగ్రామ్‌–1–2021(ఆర్‌ఎస్‌పీ–1–2021) ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: సెల్‌–మాలిక్యులార్‌ బయాలజీ, కంప్యూటేషనల్‌ బయాలజీ, డీసీజ్‌ బయాలజీ, జెనిటిక్స్, మాలిక్యులార్‌ బయాలజీ, ఇమ్యునాలజీ.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎస్‌ఐఆర్‌/యూజీసీ/డీబీటీ /ఐసీఎంఆర్‌/ఇన్‌స్పైర్‌/బీఐఎన్‌ సీ/జస్ట్‌/యూజీసీ–ఆర్‌జీఎన్‌ఎఫ్‌లో జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉండాలి. పైన తెలిపిన జాతీయ అర్హత పరీక్షల్లో జేఆర్‌ఎఫ్‌ లేని వారు దీనికి అనర్హులు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రెండు పద్ధతుల ద్వారా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు.
2021 మే చివరి వారంలో సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ సంయుక్తంగా నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఆధారంగా; అలాగే మార్చి7, 2021న నిర్వహించిన జాయింట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ బయాలజీ అండ్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్సెస్‌ (సీడీఎఫ్‌డీ–జేజాఈఈబీఐఎల్‌ఎస్‌) ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.cdfd.org.in

Photo Stories