Skip to main content

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ప్రవేశాలకు నెస్ట్-2021 నోటిఫికేషన్

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), ముంబైలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సెన్సైస్ (యూఎం-డీఏఈ సీఈబీఎస్).. సంయుక్తంగా 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ ఎంట్రన్‌‌స స్క్రీనింగ్ టెస్ట్(నెస్ట్-2021) నోటిఫికేషన్ విడుదల చేశాయి. దీనిద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ప్రవేశాలు కల్పిస్తారు.

వివరాలు:
నేషనల్ ఎంట్రన్‌‌స స్క్రీనింగ్ టెస్ట్(నెస్ట్)-2021
అర్హత:
సైన్స్ విభాగాల్లో కనీసం 60శాతం/తత్సమాన సీజీపీఏతో 2019/2020లో ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు అర్హులు. 20 21లో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జనరల్, ఓబీసీ విద్యార్థులు ఆగస్టు 01, 2001 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
పరీక్షా విధానం: ఈ పరీక్షలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ప్రతి సెక్షన్‌కు 50 మార్కులు కేటాయించారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ నాలుగు సెక్షన్లలో అభ్యర్థి ప్రతిభ కనబరిచిన మూడు సెక్షన్లను పరిగణనలోకి తీసుకొని.. సరిగా చేయని సెక్షన్‌కు వదిలేస్తారు. మెరిట్ జాబితా ఈ మూడు సెక్షన్లలో సాధించిన మార్కుల ఆధారంగా తయారు చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1200/-
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600/-
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 24, 2021.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 30, 2021.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీ: మే 20, 2021.
నెస్ట్ 2021 పరీక్ష తేది: జూన్ 14, 2021.
ఫలితాల వెల్లడి: జూన్ 30, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nestexam.in

Photo Stories