Admissions in KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలు..
సీట్ల రిజర్వేషన్: ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు.
వయసు: ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే.. మార్చి 31 నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతి, మూడో తరగతిలో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య, నాలుగో తరగతికి 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్ల మధ్య ఇలా ప్రతి తరగతికి నిర్దేశించిన మేరకు వయసు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
చదవండి: Admissions in KVS: కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకత, విద్యాబోధన, ప్రవేశ విధానం.. ముఖ్య వివరాలు ఇవే..
ఎంపిక విధానం: ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్ ప్రకారం సీటు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టమ్ ద్వారా విద్యార్థులను ఎంపికచేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు.
ఒకటో తరగతి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేది: 27.03.2023.
ఒకటో తరగతి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 17.04.2023.
రెండో తరగతి, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది(పదకొండో తరగతి మినహాయించి): 03.04.2023
రెండో తరగతి, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది(పదకొండో తరగతి మినహాయించి): 12.04.2023.
పదకొండో తరగతి రిజిస్ట్రేషన్ తేది: పదో తరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి.
వెబ్‌సైట్: https://www.kvsangathan.nic.in/