ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, విద్య అందిస్తారు. బోధన మాధ్యమం ఇంగ్లిష్. సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఏప్రిల్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష వివరాలు: ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య మోడల్ గురకుల విద్యాలయాల్లో ఆరోతరగతి ప్రవేశాలు.
సీట్ల వివరాలు
ప్రతి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో ఆరోతరగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 1680(840 బాలురు, 840 బాలికలు) సీట్లు ఉన్నాయి. ఏడో తరగతిలో 126(48 బాలికలు, బాలురు 78), ఎనిమిదో తరగతిలో 81(28 బాలికలు, బాలురు 53), తొమ్మిదో తరగతిలో 53 (29 బాలికలు, బాలురు 24) సీట్లు ఉన్నాయి.
అర్హతలు
ఆరోతరగతిలో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2022–23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.
వయసు
మార్చి 31, 2023 నాటికి ఆరోతరగతి వారు 10–13 ఏళ్లు, ఏడోతరగతి విద్యార్థులు 11–14 ఏళ్లు, ఎనిమిదో తరగతి వారు 12–15 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. తొమ్మిదో తరగతి వారు 13–16 ఏళ్ల «మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం
ఆరోతరగతి విద్యార్థులకు మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ(50 ప్రశ్నలు), అర్థమెటిక్(25 ప్రశ్నలు), తెలుగు లాంగ్వేజ్‌ల నుంచి 25 చొప్పున ప్రశ్నలుంటాయి. అలాగే 7,8,9 తరగతులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ (10 ప్రశ్నలు), రీజనల్ లాంగ్వేజ్ (తెలుగు–10 ప్రశ్నలు), మ్యాథ్స్(30 ప్రశ్నలు), సైన్స్(30 ప్రశ్నలు), సోషల్ సైన్స్ విభాగాల నుంచి 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 15.04.2023
ప్రవేశ పరీక్ష నిర్వహణ: 30.04.2023
మెరిట్ జాబితా తయారీ: 10.05.2023
ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి:17.05.2023
కాల్ లెటర్ పంపిణీ: 17.05.2023
వెబ్‌సైట్: https://twreiscet.apcfss.in/
MJPAPBCWREIS: మహాత్మా జ్యోతిబాపులే ఆర్‌జేసీ/ఆర్‌డీసీ సెట్–2023