CTET 2021: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ)..సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)–డిసెంబర్ 2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)– డిసెంబర్ 2021.
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. దీనికి నెగిటివ్ మార్కుల విధానం లేదు.
పేపర్ 1: దీన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్థులకు బోధించే వారికి నిర్వహిస్తారు. పరీక్ష 150 మార్కులు–150 ప్రశ్నలకు జరుగుతుంది. ఇందులో చైల్డ్ డవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు–30 మార్కులు, లాంగ్వేజ్ 1–30 ప్రశ్నలు–30 మార్కులకు, లాంగ్వేజ్ 2–30 ప్రశ్నలు–30 మార్కులకు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు–30 మార్కులకు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష ఉంటుంది.
పేపర్ 2: దీన్ని ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులకు బోధించే వారికి నిర్వహిస్తారు. ఇది 150 మార్కులు–150 ప్రశ్నలకు జరుగుతుంది. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు–30 మార్కులు, లాంగ్వేజ్ 1–30 ప్రశ్నలు–30 మార్కులకు, లాంగ్వేజ్ 2–30 ప్రశ్నలు–30 మార్కులకు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 ప్రశ్నలు–60 మార్కులు/సోషల్ స్టడీస్ 60 ప్రశ్నలు–60 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:19.10.2021
వెబ్‌సైట్: https://ctet.nic.in