GAT B & BET Exam 2023: పోస్టు గ్రాడ్యుయేట్ బయోటెక్నాలజీ విభాగాల్లో ప్రవేశాలు
జీఏటీ-బీ కోర్సులు: ఎమ్మెస్సీ(బయో టెక్నాలజీ, అగ్రి బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు),ఎంటెక్(బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు), ఎంవీఎస్సీ (యానిమల్ బయోటెక్నాలజీ).
అర్హత: కనీసం 55›శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ, బీటెక్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉత్తీర్ణులై ఉండాలి.
బీఈటీ కోర్సులు: ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేటెట్ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు, దివ్యాంగులు, మహిళలు 31 ఏళ్లు మించకూడదు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష వ్యవధి: 180 నిమిషాలు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 31.03.2023.
- పరీక్ష తేది: 23.04.2023.
- వెబ్‌సైట్: https://dbt.nta.ac.in/