CTET 2024 Answer Key ఈ తేదీన విడుదలయ్యే అవకాశం!.. ఫలితాలు విడుదల తేదీ ఇదే..
Sakshi Education
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)2024 డిసెంబర్ సెషన్‌కు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీ జనవరి 1 లేదా 2న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేయనుంది.
సమాధాన కీ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా:
- అధికారిక వెబ్‌సైట్: ctet.nic.in ని సందర్శించండి.
- "CTET డిసెంబర్ 2024 తాత్కాలిక సమాధాన కీ" లింక్‌పై క్లిక్ చేయండి.
- రోల్ నంబర్, పుట్టిన తేది నమోదు చేయండి.
- సమాధాన కీని డౌన్‌లోడ్ చేసుకోండి.
అభ్యంతరాలు నమోదు చేయడం:
తాత్కాలిక సమాధాన కీ విడుదల తర్వాత, అభ్యర్థులు ఏదైనా తపులు ఉంటే ఒక్క ప్రశ్నకు ₹1,000 ఫీజుతో అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. మీ అభ్యంతరాలు సరైనవిగా ఉంటే ఫీజు తిరిగి అందుతుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఫలితాల విడుదల:
తుది సమాధాన కీని పరిశీలించి, జనవరి 6, 2025 నాటికి CTET ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. గత సెషన్లలో CBSE సాధారణంగా పరీక్ష తేదీ నుండి 25 రోజుల లోపు ఫలితాలు ప్రకటించింది.
Published date : 31 Dec 2024 06:27PM