NEET 2023: నీట్ ఎండీఎస్–2023, దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్)–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)ను నిర్వహిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ(బీడీఎస్) ఉత్తీర్ణతతోపాటు 31.03.2023 నాటికి ఇంటర్న్‌షిప్/ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.01.2023.
పరీక్ష తేది: 01.03.2023.
వెబ్‌సైట్: https://natboard.edu.in
చదవండి: Admissions in TISS: టిస్ నెట్-2023 పీజీలో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..
Last Date