AP EDCET 2023 Notification: ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల..
ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ(స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ నిర్వహిస్తోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం: పరీక్షలో మూడు విభాగాలలో 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టి విధానంలో ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.04.2023.
ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తులకు చివరితేది: 02.05.2023.
ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తుకు చివరితేది: 10.05.2023.
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్ తేది: 12.05.2023.
ప్రవేశ పరీక్ష తేది: 20.05.2023.
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/
Last Date