Skip to main content

ఐఐఐటీ హైదరాబాద్‌–పీజీఈఈ 2021 ప్రవేశాలు

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ).. 2021 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (పీజీఈఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (పీజీఈఈ)–2021
  • మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంటెక్‌):
    ప్రోగ్రాములు:
    కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్, ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌.
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. ప్రొడక్ట్‌ అండ్‌ డిజైన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి బీఈ/బీటెక్‌/డిజైన్‌/సైన్స్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
  • మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్‌):
    ప్రోగ్రామ్‌లు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, సివిల్, బయోఇన్ఫర్మాటిక్స్, ఐటీ (బిల్డింగ్‌ సైన్స్‌).
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
  • డాక్టర్‌ ఆఫ్‌ పిలాసఫీ (పీహెచ్‌డీ):
    ప్రోగ్రామ్‌లు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్‌ లింగ్విస్టిక్స్, కంప్యూటేషనల్‌ నేచురల్‌ సైన్స్, కాగ్నిటివ్‌ సైన్స్‌ తదితరాలు.
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్‌ /ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ/ఎంబీబీఎస్‌/ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్ష తేది: ఏప్రిల్‌ 18, 2021.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2000 చెల్లించాలి

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.iiit.ac.in

Photo Stories