Admissions in IRT: ఐఆర్‌టీ, న్యూఢిల్లీలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
న్యూఢిల్లీలోని రైల్వే విభాగానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్(ఐఆర్‌టీ).. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
ట్రాన్స్‌పోర్ట్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్; మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్; రైల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ మేనేజ్‌మెంట్.
అర్హత: సీనియర్ సెకండరీ స్కూల్/ఏదైనా గ్రాడ్యుయేషన్/బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సీనియర్ సెకండరీ స్కూల్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
కోర్సు వ్యవధి: ఏడాది; కోర్సు ఫీజు:రూ.8000.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్, లక్నో, గువహటి, భువనేశ్వర్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.02.2022
వెబ్‌సైట్: https://irt.indianrailways.gov.in
చదవండి: Admission in GRSE: జీఎంఈ/ టీఎంఈ ట్రెయినింగ్ కోర్సులో ప్రవేశాలు..