Skip to main content

ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌లో డిప్లొమా కోర్సులు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది మే 22..

భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)టెక్నాలజీ సెంటర్‌.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
డిప్లొమా(టూల్‌–డై మేకింగ్‌):
కోర్సు వ్యవధి:
నాలుగేళ్లు.
సీట్ల సంఖ్య: 60.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సైన్స్‌–మ్యాథ్స్‌ సబ్జెక్టులతో పదో తర గతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 15–19 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

డిప్లొమా(మెకట్రానిక్స్‌):
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
సీట్ల సంఖ్య: 60.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సైన్స్‌–మ్యాథ్స్‌ సబ్జెక్టులతో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 15–19 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ పద్ధతిలో రాతపరీక్ష ఆధారంగా(ఆబ్జెక్టివ్‌–సబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు) ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పదో తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు కూడా రాత పరీక్షకు హాజరుకావచ్చు.

రాతపరీక్ష తేది: 28.06.2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్‌ మేనేజర్, ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ డ్రగ్, ప్లాట్‌ నెం:2డీ, సెక్టార్‌–బి, బొరాయి ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ సెంటర్, రసమడా, డిస్టిట్‌–దుర్గ్‌(సి.జి)–491001 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.06.2021

వెబ్‌సైట్‌: www.msmetcdurg.org

Tags

Photo Stories