పీజీ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..
విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష (NEET)– 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24న ఉదయం 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. యూనివర్సిటీ పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను ప్రకటి స్తుంది. దరఖాస్తులను https://tspgmed.tsche.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం నింపే సమయంలో సాంకేతిక సమస్యలకు 93926 85856, 78425 42216, 90596 72216 నంబర్లకు, నిబంధనల కోసం 94905 85796, 85006 46769 నంబర్లకు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫోన్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం https://www.knruhs.telangana.gov.inను సంప్రదించాలని తెలిపింది.
చదవండి: