UPSC Notification 2023: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023, దరఖాస్తు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 1105
అర్హతలు: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
వయసు: 01.08.2023 నాటికి 21–32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
అటెంప్ట్‌ల సంఖ్య: జనరల్ అభ్యర్థులకు ఆరు, ఓబీసీ, దివ్యాంగులకు తొమ్మిది సార్లు అవకాశముంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.02.2023
ప్రిలిమ్స్ పరీక్ష తేది: 28.05.2023
వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/
Qualification | GRADUATE |
Last Date | February 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |