Andhra Pradesh Govt Jobs: జీజీహెచ్, నెల్లూరులో 79 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. నెల్లూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్)లో ఒప్పంద/అవుట్æసోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 79
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, బయో–మెడికల్ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్‌ఎం, డిప్లొమా/బీఎస్సీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, నెల్లూరు, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
చదవండి: Andhra Pradesh Govt Jobs: జీజీహెచ్, కర్నూలులో 80 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | 10TH |
Last Date | December 15,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |