Andhra Pradesh Jobs: డీసీసీబీ బ్యాంక్, నెల్లూరులో 65 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో ది నెల్లూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(ఏడీసీసీబీ).. ఉద్యోగాల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు–42, అసిస్టెంట్ మేనేజర్లు–23.
స్టాఫ్ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు:
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్‌తో పాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్లు:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్/స్టాటిస్టిక్స్/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఆన్‌లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60
నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021
వెబ్‌సైట్: http://nelloredccb.com/
చదవండి: Andhra Pradesh Jobs: డీసీసీబీ బ్యాంక్, కర్నూలులో 17 పోస్టులు..
Qualification | GRADUATE |
Last Date | December 03,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |