APPSC Recruitment: 730 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 730
పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ డిపార్ట్‌మెంట్): 670
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3(ఎండో మెంట్స్ సబ్ సర్వీస్): 60
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.01.2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి:
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
Qualification | GRADUATE |
Last Date | January 29,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |