Andhra Pradesh Govt Jobs: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతపురంలో 93 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. అనంతపురం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతి పదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 93
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, బయో–మెడికల్ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్‌ఎం, డిప్లొమా/బీఎస్సీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, అనంతపురం, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
చదవండి: Andhra Pradesh Govt Jobs: ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరులో 103 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 15,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |