Telangana Jobs: డీఎంఈ, తెలంగాణలో మెడికల్ టీచింగ్ పోస్టులు.. నెలకు రూ.1,90,000
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటుచేసిన 8 వైద్య కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, అనెస్తీషియాలజీ తదితరాలు.
వైద్య కళాశాలలు: జీఎంసీ వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన అనుభవంతోపాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వేతనం: ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.10.2021
వెబ్‌సైట్: https://dme.telangana.gov.in
చదవండి: IBPS Recruitment: 4135 పీవో పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Qualification | GRADUATE |
Last Date | October 28,2021 |
Experience | 5 year |
For more details, | Click here |