Bar Council: లా అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికన లా అసోసియేట్ పోస్టుల భర్తీకి లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: లా అసోసియేట్లు
అర్హత: 3/5 ఏళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో నమోదు చేసుకొని ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.60వేల వేతనంతోపాటు నెలకు రూ.15వేల ప్రయాణ అలవెన్స్ అందిస్తారు.
ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన అభ్యర్థుల్ని వైవా వాయిస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం.
దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021
వెబ్‌సైట్: https://law.telangana.gov.in
Qualification | GRADUATE |
Last Date | October 08,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |