Andhra Pradesh: యూసీఐఎల్, తుమ్మలపల్లిలో 30 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. 2021–22 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 30
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్, మెకానికల్ డీజిల్, టర్నర్/మెషినిస్ట్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌వీసీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 02.11.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021
వెబ్‌సైట్: http://www.ucil.gov.in/
Qualification | 10TH |
Last Date | November 02,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |