Skip to main content

TGWDCW Recruitment 2021: 318 అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

TGWDCW

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం(టీజీడబ్ల్యూడీసీడబ్ల్యూ).. రాజన్న సిరిసిల్లా, వికారాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన వివాహిత మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 318
జిల్లాల వారీగా ఖాళీలు: రాజన్న సిరిసిల్ల–72, వికారాబాద్‌–82, మహబూబ్‌నగర్‌–164.
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకురాలు, మినీ అంగన్‌ వాడీ టీచర్లు.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. 
వయసు: 21ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: రాజన్న సిరిసిల్లా, మహబూబ్‌నగర్‌ జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్‌ 30వ తేదీ లోపు;వికారాబాద్‌ అభ్యర్థులు సెప్టెంబర్‌ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 
చిరునామా: అభ్యర్థులు సంబంధిత జిల్లా అంగన్‌వాడీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. 

వెబ్‌సైట్‌: https://mis.tgwdcw.in
 

Qualification 10TH
Last Date September 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories