ASRB 2023 notification: పీహెచ్‌డీతో అగ్రి సైంటిస్ట్
- అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్ పరీక్షకు నోటిఫికేషన్
- ఐసీఏఆర్‌లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ
- మొత్తం 51 విభాగాల్లో 260 పోస్ట్‌లు
- ప్రారంభ వేతన శ్రేణి రూ.57,700-రూ.1,82,400
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్.. సంక్షిప్తంగా ఐసీఏఆర్. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విభాగాల్లో పరిశోధనలకు, ఆవిష్కరణలకు ప్రసిద్ధి గడించిన ఇన్‌స్టిట్యూట్. ఇందులో యువ సైంటిస్ట్‌లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించే పరీక్ష.. అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఎగ్జామినేషన్. ఏఎస్‌ఆర్‌బీ.. ప్రతిఏటా ఏఆర్‌ఎస్‌ను నిర్వహిస్తూ.. అర్హులైన అభ్యర్థులను ఐసీఏఆర్‌కు సిఫార్సు చేస్తుంది. పీహెచ్‌డీ పూర్తి చేసుకుని.. సైంటిస్ట్‌గా కొలువు సొంతం చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మొత్తం పోస్టులు 260
ఈ ఏడాది అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విభాగాలకు సంబంధించి మొత్తం 51 విభాగాల్లో 260 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే విభాగానికి సంబంధించిన స్పెషలైజేషన్‌తో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
అర్హతలు
- నిర్దేశిత విభాగాలు/అంశాల్లో సెప్టెంబర్ 30లోపు పీహెచ్‌డీ పూర్తి చేసుకోవాలి.
- వయసు: జనవరి 1, 2023 నాటికి 21-35ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ
- ఏఆర్‌ఎస్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. తొలి దశలో ఏఆర్‌ఎస్ రాత పరీక్ష ఉంటుంది. అందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఏఆర్‌ఎస్ రాత పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో మూడు వందల మార్కులకు జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు.
పర్సనల్ ఇంటర్వ్యూ
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారితో మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరిలో ఒక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 60 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో పూర్తి చేసిన పీహెచ్‌డీ అంశం, దాని ఉద్దేశం, భవిష్యత్తు లక్ష్యం, ఆసక్తి ఉన్న పరిశోధన విభాగాలపై అభ్యర్థి దృక్పథాన్ని పరిశీలిస్తారు.
పరిశోధన ఫలితాలకూ మార్కులు
ఏఆర్‌ఎస్ తదుపరి దశలో సైంటిస్ట్‌లుగా ఎంపిక చేసే క్రమంలో.. అభ్యర్థులు పీహెచ్‌డీలో చేసిన పరిశోధనలు, వాటి ఫలితాలకు కూడా మార్కులు కేటాయిస్తారు. దీనికి 40 మార్కులు ఉంటాయి.
ఎంపిక ఇలా
సైంటిస్ట్ ఎంపిక ప్రక్రియలో చివరగా మొత్తం మూడు అంశాల్లో స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు. అవి.. ఏఆర్‌ఎస్ పరీక్ష, పరిశోధనల ఫలితాలు, పర్సనల్ ఇంటర్వ్యూ. ఏఆర్‌ఎస్‌కు గరిష్టంగా 300 మార్కులు; పరిశోధనల ఫలితాలకు 40 మార్కులు; పర్సనల్ ఇంటర్వ్యూకు 60 మార్కులు చొప్పున మొత్తం 400 మార్కుల ప్రాతిపదికగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ మూడు అంశాల్లో అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకించి ఫైనల్ మెరిట్ జాబితా రూపొందించి.. తుది నియామకాలు ఖరారు చేస్తారు.
సైంటిస్ట్‌గా నియామకం
మూడు దశల్లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిచిన వారిని ఐసీఏఆర్‌లో ఆయా విభాగాల్లో సైంటిస్ట్‌లుగా నియమిస్తారు. రెండేళ్లపాటు ప్రొబేషన్‌గా పరిగణిస్తారు. ప్రొబేషన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. ఐసీఏఆర్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న పరిశోధన కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వేతనం
సైంటిస్ట్‌లుగా ఎంపికైన వారికి పే బ్యాండ్-3(రూ.15,600-రూ.39,100)తో కెరీర్ ప్రారంభమవుతుంది. సవరించిన వేతన స్కేల్ ప్రకారం-రూ.57,700- రూ.1,82,400గా పేర్కొన్నారు. సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన వారు తర్వాత సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, డిప్యూటీ డైరెక్టర్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.
అటెంప్ట్‌లపై పరిమితి
ఏఆర్‌ఎస్ పరీక్షకు జనరల్ అభ్యర్థులు గరిష్టంగా ఆరు సార్లు, ఓబీసీ వర్గాల వారు తొమ్మిదిసార్లు మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం ఉంది. ఎస్‌సీ/ఎస్‌టీ వర్గాల అభ్యర్థులు తమ గరిష్ట వయోపరిమితి ముగిసేలోపు ఎన్నిసార్లయినా పరీక్ష రాయొచ్చు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 5 - జూలై 26, 2023
- ఏఆర్‌ఎస్ పరీక్ష తేదీ: అక్టోబర్/నవంబర్‌లో నిర్వహించే అవకాశం
- తెలుగు రాష్ట్ర్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.asrb.org.in/
చదవండి: ASRB Recruitment 2023: 260 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | July 26,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |