Oil India Limited Recruitment: ఓఐఎల్‌లో ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: సూపరింటెండింగ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ.
విభాగాలు: డ్రిల్లింగ్, రేడియాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, జియోఫిజిక్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఎల్‌ఎల్‌బీ, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ ఆధారిత టెస్ట్, స్కిల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021
వెబ్‌సైట్: https://www.oil-india.com/
చదవండి: IGDTUW Recruitment: టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
Qualification | DIPLOMA |
Last Date | October 10,2021 |
Experience | 1 year |
For more details, | Click here |