BCPL Recruitment: బీసీపీఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన దిబ్రూఘర్‌లోని బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్(బీసీపీఎల్)..వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ఫోర్‌మెన్ ట్రెయినీ, ఆపరేటర్ ట్రెయినీ, టెక్నీషియన్ ట్రెయినీ తదితరాలు.
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ తదితరాలు.
అర్హతలు
ఫోర్‌మెన్ ట్రెయినీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు 30 ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.23వేలు చెల్లిస్తారు.
ఆపరేటర్ ట్రెయినీ: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు 30ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.21వేలు చెల్లిస్తారు.
టెక్నీషియన్ ట్రెయినీ: మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు 30 ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.21వేలు చెల్లిస్తారు.
అకౌంట్స్ అసిస్టెంట్: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ టైపింగ్ అర్హత సాధించాలి.
వయసు 30ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.21వేలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.12.2021
వెబ్‌సైట్: https://bcplonline.co.in/Career
చదవండి: OIL Recruitment: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 146 డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | December 11,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |