Skip to main content

Job Mela Result: జాబ్‌ మేళాతో ఉద్యోగం సాధించిన నిరుద్యోగులు

ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన జాబ్‌ మేళా లో వందకు పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. వారిలో స్కిల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో ఉద్యోగాల్ని సాధించిన వారిని కళాశాల ప్రిన్సిపాల్‌ అభినందించి, ప్రోత్సాహించారు..
Company representatives interviewing unemployed candidates in government degree college

 

గుమ్మలక్ష్మీపురం: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురంలోని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాలో 38 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి. శ్రీవరం బుధవారం తెలిపారు. ఈ జాబ్‌మేళాకు డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, హెటిరో డ్రగ్స్‌, అపోలో ఫార్మశీ, బీఎఫ్‌ఐఎల్‌ కంపెనీల ప్రతినిధులు హాజరై జాబ్‌మేళాకు వచ్చిన 116 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి వారిలో 38 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

Civil Engineering: యూనివర్సిటీలో 'ప్రతిష్ట 2024' పేరుతో టెక్నికల్‌ సింపోజియం

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ జాబ్‌మేళా ద్వారా ఉద్యోగం పొందిన నిరుద్యోగులు ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగం ఏచోట ఇచ్చినా అక్కడికి వెళ్లి పనిచేసి స్థిరపడి, తర్వాతి వారికి మార్గదర్శకంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.రామయ్య, ఎన్‌ఎస్‌ఎస్‌ పీఓ బి.త్రినాథ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Published date : 14 Mar 2024 01:24PM

Photo Stories