JEE National Level Ranker: జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయి ర్యాంకు సాధించిన కర్నూలు విద్యార్థి.. ఈ ప్రణాళికతో..
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీలో ఇంటర్ ఫలితాలతోపాటు జేఈఈ ఫలితాలు కూడా విడుదలైయ్యాయి. విద్యార్థులంతా ఈ రెండు పరీక్షల్లోనూ తమ సత్తా చాటి, ప్రతిభను కనబరిచారు. జేఈఈ ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్లకు చెందిన విద్యార్థి కె. ప్రశాంత్ రెడ్డి తన ప్రతిభను కనబరిచి జాతీయస్థాయిలో 148వ ర్యాంకును సాధించి సభాష్ అనిపించుకున్నాడు.
చదువు..
ప్రశాంత్ తన పూర్తి పాఠశాల విద్యను తమ గ్రామంలోని విఆర్ పాఠశాలలోనే చదివాడు. ఇక్కడే తన తల్లి ప్రవేట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉంటున్నారు. ఇక్కడ తన చదువు ముగిసిన అనంతరం, తాను కర్నూల్లోని యస్.ఆర్ జూనియర్ కళాశాలలో తన ఇంటర్ విద్యను ప్రారంభించాడు. అక్కడ హాస్టల్లో ఉంటూనే తన ఇంటర్ చదువును పూర్తి చేసుకున్నడు.
పరీక్షకు ప్రణాళిక..
జేఈఈ పరీక్షల కోసం రోజుకు 12 గంటలపాటు కష్టపడి చదివేవాడు. ఇలా ప్రతీరోజు ఉదయం 6 నుంచి 11 గంటలవరకు కేవలం మెయిన్స్ పరీక్ష కోసమే సాధన చేసేవాడు. తన కళాశాలలో ఉపాధ్యాయులు ఇచ్చే ప్రతీ నోట్స్‌ను, ప్రతీ పాఠాలను శ్రద్ధగా విని, తన పుస్తకంలో రాసుకొని తిరిగి రివిజన్ చేసేవాడు. అన్ని వివరాలను షార్ట్ నోట్స్‌లా మార్చుకొని సాధన చేసేవాడు. ఇలా, తన ప్రణాళికతో తన పరీక్షకు సిద్ధమై పరీక్ష రాసాడు. ఈ ప్రణాళిక కారణంగానే తాను ర్యాంకును సాధించగలిగాడని తెలిపాడు ప్రశాంత్.
ఆశయం ఇదే..
అయితే, ప్రశాంత్ ఆశయం ప్రకారం.. తాను భవిష్యత్తులో నీటితో నడిచే వాహనాలను తయారు చేస్తానని వివరించాడు. ఇదే తన లక్ష్యమని, పరీక్ష కోసం కష్టపడినట్టే నా లక్ష్యం కోసం కూడా కష్టపడతానని తెలిపాడు. అలాగే, ఇటువంటి వాహనాలు తయారు చేసేందుకు పరిశోధన కూడా చేస్తానని వివరించాడు.
జాతీయ స్థాయిలో జేఈఈ ర్యాంకర్లు..
అలాగే, వివిధ కేటగిరీలలో కర్నూల్ జిల్లాకు చెందిన ఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించారు.. కె.ప్రశాంత్ రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ - 148, వేదవచన్ రెడ్డి - 1647, మల్లు నాయక్ - 1580, బద్రినాథ్ రెడ్డి - 4476, యస్.శివమణి - 5954, చరణ్ తేజ్- 8618, సాయి సృజన్ - 9218. ఇలా, మొత్తం 30 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరచడంతో కళాశాల ఉపాధ్యాయులు, అధికారులతోపాటు పలువురు వీరికి అభినందనలు తెలిపారు. అయితే, ఇటీవల విడుదలైన ఇంటర్, టెన్త్ ఫలితాలలో ప్రతిభ కనబర్చిన కర్నూల్ విధ్యార్థులు, జేఈఈ లో సైతం ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం.
Tags
- JEE Mains Results
- JEE ranker
- inter students ranks in jee
- top rankers of jee mains exam 2024
- national level rankers
- JEE Mains Exam Ranker Prashanth Reddy
- 148th rank in national level
- ap tenth and inter results
- ap jee rankers
- students talent
- national level jee rankers 2024
- preparation for JEE mains exam
- Success in JEE exam
- Education News
- Success Stories
- JEEresults
- APInterresults
- KPrashanthReddy
- Kovelakunt
- KurnoolDistrict
- Talent
- NationalLevel
- sakshieducation success stories