Training and Job Offer: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భాషపై శిక్షణ
Sakshi Education
నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తోంది స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. యువకులు ఇక్కడ శిక్షణ పొంది విదేశాంలో ఉపాధి దక్కించుకోవచ్చు. ఈ శిక్షణ పొందేందుకు అర్హుల గురించి కూడా వెల్లడించారు. ఈ భాష నేర్చుకుంటే చాలు..

ఎచ్చెర్ల క్యాంపస్: జపనీస్ భాషపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి పీబీ సామిశ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ ఉన్న వారికి ఉపయోగ పడుతుందని అన్నారు.
Skill Development Colleges: అరకులో స్కిల్ కళాశల.. నిరుద్యోగులకు శిక్షణతో ఉపాధి అవకాశాలు
శిక్షణ అనంతరం జపాన్‌లో పనిచేసేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడ నర్స్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. 20 నుంచి 32 ఏళ్ల మధ్య మహిళలు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు https:/www.skilluniverse.apssdc.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని అన్నారు.
Published date : 11 Mar 2024 03:20PM