Skip to main content

Skill Hub: యువ‌త‌కు ఉపాధి కోసం స్కిల్‌హబ్‌లు

నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించేందుకు ఏర్ప‌రిచిన స్కిల్‌హబ్‌ల గురించి ఎమ్మెల్యే తెల్లం బాల‌రాజు తెలిపారు. అక్క‌డ అందించే శిక్ష‌ణ, దాని వ‌ల‌న క‌లిగే ఉపాధి గురించి స్ప‌ష్టిస్తూ ఉపాధి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.
MLA Tellam Balaraju ,Employment training for Youth unemployees, skill hubs for employment
Employment training for Youth unemployees

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్కిల్‌హబ్‌ల ద్వారా శిక్షణలు అందిస్తున్నారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన స్కిల్‌ హబ్‌లో రెండో బ్యాచ్‌ శిక్షణను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మొదటి బ్యాచ్‌ డొమెస్టిక్‌ ఎలక్ట్రీషియన్‌ సొల్యూషన్‌ కోర్సు శిక్షణ పూర్తయ్యిందన్నారు.

Group 1 rankers: విద్యార్థుల‌కు స‌న్మానస‌భ‌

శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌, ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు. అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ శ్రీపూజ మాట్లాడుతూ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గంటా సుధాకర్‌ మాట్లాడుతూ శిక్షణ తర్వాత ఉద్యోగం పొందిన వారు ఆయా ఉద్యోగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఎంపీపీ కారం శాంతి, వైస్‌ ఎంపీపీలు కుక్కల వరలక్ష్మి, గగ్గులోతు మోహన్‌రావు, ప్రిన్సిపాల్‌ భక్త హ నుమాన్‌, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌ తెల్లం వెంకాయమ్మ, సొసైటీ అధ్యక్షుడు ఆరేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Published date : 19 Sep 2023 03:24PM

Photo Stories