Skip to main content

Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా

Mega Job Mela tomorrow

కంచరపాలెం(విశాఖ): జిల్లా ఉపాధి కార్యాలయంలోని నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌లో సెప్టెంబర్‌ ఒకటో తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారులు సీహెచ్‌ సుబ్బిరెడ్డి(క్లరికల్‌),కె.శాంతి(టెక్ని కల్‌) తెలిపారు. ఐఐఎఫ్‌ఎల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఆధాష్‌ సొల్యూషన్స్‌, ఎంఏఎస్‌ మైరెన్‌ స ర్వీ సెస్‌, ట్రీని టెక్‌ ఇన్ఫ్రా ఇండియా, టీం లీజ్‌, బయోఫోర్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, మేధా సర్వో డ్రైవ్‌, రిలయన్స్‌ డిజిటల్‌ తదితర కంపెనీల్లో 640 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. కస్టమర్‌ అండ్‌ ఫీల్డ్‌ ట్రైనీ, సేల్స్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, ఫార్మాసిస్ట్‌, అసెంబ్లీ ఆపరేటింగ్‌ కాల్‌ అసిస్టెంట్‌, ఆపరేటర్‌, కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌, కెమిస్ట్‌, క్యాషియర్‌, జూనియర్‌ క్యాడ్‌ ఇంజినీర్‌, కార్పెంటర్‌, వేర్‌హౌస్‌ అసోసియేట్స్‌, జీఐఎస్‌ ఇంజినీర్‌ క్యాడ్‌, అకౌంటెంట్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కేర్‌ టేకర్స్‌, సెక్యూరిటీ గార్డ్స్‌, బ్రాంచ్‌ గొడౌన్‌ ఇన్‌చార్జి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, ఐటీఐ, బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణులైన మహిళా, పురుష అభ్యర్థులు అర్హులు. వయసు 18–45ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా ఉద్యోగాలను బట్టి జీతం నెలకు రూ.12,500 నుంచి రూ40,000 వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://www.ncs.gov.in లో పేర్లు నమోదు చేసుకుని.. శుక్రవారం జరిగే జాబ్‌మేళాకు హాజరు కావాలని వారు కోరారు.

చదవండి: Job Mela: 5న కాటారంలో జాబ్‌మేళా

Published date : 31 Aug 2023 03:21PM

Photo Stories