Skip to main content

Job Mela: 5న కాటారంలో జాబ్‌మేళా

ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా గిరిజన నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి సెప్టెంబర్‌ 5వ తేదీన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ అంకిత్‌ ఆగ‌స్టు 29న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Job Mela at Kataram on 5th
5న కాటారంలో జాబ్‌మేళా

 పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, బీటెక్‌ చదివిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు గిరిజన యువత జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. సర్టిఫికెట్లను తమ వెంట తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9490341911, 8008932159 నంబర్లను సంప్రదించాలన్నారు.

చదవండి:

Jobs: 32 పోస్టులు.. 424 దరఖాస్తులు!

Job Fair: రేపు జాబ్‌ మేళా

Published date : 30 Aug 2023 04:07PM

Photo Stories