Skip to main content

Mega Job Mela: మెగా జాబ్‌మేళా.. 5వేల ఉద్యోగాలు..

కాటారం: మండలకేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో మార్చి 11న‌ నిర్వహించనున్న మెగాజాబ్‌ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్‌ కాంగ్రెస్‌ మండల అద్యక్షుడు చీమల సందీప్‌ తెలిపారు.
Mega Job Mela

మండలకేంద్రంలో మార్చి 10న‌ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. జాబ్‌మేళాకు సుమారు 200 కంపెనీలు పాల్గొని 5వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎలాంటి చదువు లేని వారి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

చదవండి: Mini Job Mela: రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌ మేళా

కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలోని కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌, పలిమెల మండలాల్లోని నిరుద్యోగులు తమ ధృవీకరణ పత్రాలు తీసుకొని జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధృడ సంకల్పంతో మంత్రి శ్రీధర్‌బాబు, శ్రీపాద ట్రస్టు చైర్మన్‌ శ్రీనుబాబు మెగాజాబ్‌ మేళాకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు కొట్టె ప్రభాకర్‌, కొట్టె శ్రీహరి, పసుల మొగిలి, రాహుల్‌, రాజబాబు, శశి, మంత్రి నరేశ్‌, మేడిపల్లి కిరణ్‌ పాల్గొన్నారు.

Published date : 11 Mar 2024 03:10PM

Photo Stories