Skip to main content

Mega Job Mela for Youth: నిరుద్యోగ యువ‌త‌కు స‌రికొత్త అవ‌కాశం.... వినియోగించుకోండి.

ఎంతోమంది యువ‌త‌లు ఉద్యోగావ‌కాశం గురించి ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఇది ఒక సువ‌ర్ణావ‌కాశం. భీమ‌వరం డీఎన్ఆర్ కాలేజీలో ఓ మెగా జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నార‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. అందులో ఉన్న కంప‌నీలు, వారికి ఉండాల్సిన అర్హ‌త‌ల‌ను గురించి ఆమె మాట్లాడ‌తూ పూర్తి వివ‌రాల‌ను తెలియ‌జేసారు.
Mega Job opportunity for Youth unemployees DNR college, Bheemavaram college
Mega Job opportunity for Youth unemployees

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లాలోని నిరుద్యోగ యువత జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఈనెల 13న భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేగా జాబ్‌మేళా బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సుమారు 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొని 1,270 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారన్నారు.

Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణ‌, ఏపీలో భారీగా దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎ.కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాబ్‌మేళాలో ముత్తూట్‌ ఫైనాన్స్‌, అపోలో ఫార్మసీ, ఆక్సిస్‌ బ్యాంకు, అరబిందో ఫార్మా, అపెక్స్‌ సొల్యూషన్స్‌, యంగ్‌ ఇండియా మార్కెటింగ్‌, శ్రీరామ్‌ ఇన్సూరెన్స్‌, ఎల్‌ఐసీ, ఇన్నోవ్‌ సోర్స్‌ వంటి 21 కంపెనీల్లో టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌, జీఐఎస్‌ ఇంజనీర్‌, సర్వీస్‌ ఇంజనీర్‌, కస్టమర్‌ రిలేషన్‌ కో–ఆర్డినేటర్‌, ఇన్సైడ్‌ కార్పొరేట్‌ సేల్స్‌, క్వాలిటీ కంట్రోల్‌, మిషన్‌ ఆపరేటర్‌, టెలికాలర్స్‌, లోన్‌ ఆఫీసర్‌ వంటి ఉద్యోగాలకు నియామకాలు ఉంటాయన్నారు.

Educational Policy Changes: ఉత్త‌మ ఉపాధ్య‌యుల‌ను స‌త్క‌రించిన‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

పదో తరగతి, ఇంటర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18–35 ఏళ్ల వయసున్న వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్ల నకళ్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు నాగేంద్ర 8919684670, ప్రసన్న 7013896277, 9988853335 (టోల్‌ ఫ్రీ)ను లేదా ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. డీఎన్నార్‌ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రెసిడెంట్‌ జి.పాండురంగ రాజు, ప్రిన్సిపాల్‌ బీఎస్‌ శాంతకుమారి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పి.రామకృష్ణంరాజు పాల్గొన్నారు.

Published date : 13 Sep 2023 10:07AM

Photo Stories