Educational Policy Changes: ఉత్తమ ఉపాధ్యయులను సత్కరించిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి
సాక్షి ఎడ్యుకేషన్: జాతీయ విద్యావిధానంతో విద్యాపరంగా అనే మార్పులు తథ్యమని గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యాఖ్యానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లోని భారతీయార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను గవర్నర్ ఆర్‌ఎన్ రవి సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో సాంకేతికత అభివృద్ధి విప్లవాత్మక వృద్ధిని సాధించిందన్నారు. పోటీ ప్రపచంలో మరింతగా విద్యాపరంగా అధ్యాపక సిబ్బంది రాణించాల్సిన అవసరం ఉందన్నారు.
NABARD Recruitment 2023: నాబార్డ్లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
సాంకేతిక యుగంలో పోటీ పరీక్షలకు పిల్లలను సిద్ధం చేయడంలో బీజీగా మారిన తల్లిదండ్రులు ప్రస్తుతం ఉపాధ్యాయులను నమ్మడం మానేశారని వ్యాఖ్యానించారు. ఇది వరకు పిల్లలను ఉపాధ్యాయులు ఖండించే వారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం ఆపరిస్థితి లేదన్నారు. విద్యార్థుల శ్రేయస్సు కోసమే ఉపాధ్యాయులు ఖండిస్తున్నారన్న విషయాన్ని ఎవ్వరూ గ్రహించడం లేదన్నారు. కేంద్ర విద్యా చట్టంలో అనేక మార్పులు ఉన్నాయని, ఇది అమల్లోకి రావడం ద్వారా విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.