AP Senior Resident Recruitment 2024: ఏపీలో సినియర్ రెసిడెంట్స్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. నెలకు జీతం రూ. 70వేలు
Sakshi Education
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందు మెడికల్ కాలేజీల్లో 241 మంది సీనియర్ రెసిడెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: 44 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: మే 5 నుంచి ప్రారంభం
అప్లికేషన్‌కు చివరి తేది: మే 12వ తేదీ వరకు
ఎంపిక ప్రక్రియ: వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్‌వోఆర్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ. రూ. 70 వేలు
Published date : 04 May 2024 03:01PM