Skip to main content

Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణ‌, ఏపీలో భారీగా దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ సారి స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా సెలవులు భారీగానే రానున్నాయి. ఏపీలో కంటే.. ఈ సారి తెలంగాణ‌లోనే ఎక్కువ‌గా దసరా సెలవులు ఇవ్వ‌నున్నారు.
dussehra holidays 2023 news in telugu,Telangana,AP vs. Telangana Holidays
AP & TS Dussehra Holidays 2023

తెలంగాణ‌లో దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా.. ఈ ఏడాది మాత్రం 13 రోజులే ఇచ్చారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26వ తేదీన (గురువారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

తెలంగాణ పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో..

dussehra holidays 2023 news

తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెల‌వుల పూర్తి వివ‌రాల‌ను పాఠశాల విద్యాశాఖ పొందిప‌రిచిన విష‌యం తెల్సిందే. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు. అలాగే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు త‌మ క్యాలెండర్‌లో సెల‌వులను పొందుప‌రిచారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద‌స‌రా సెల‌వులు ఎన్ని రోజులంటే..?

ts schools dussehra holidays holidays news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ‌,ప్రైవేటు స్కూల్స్‌కు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చారు. మొత్తం 10 రోజుల పాటు స్కూల్స్‌కు ద‌స‌రా సెల‌వులు రానున్నాయి. తిరిగి అక్టోబర్ 25వ తేదీన (బుధ‌వారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెల‌వుల పూర్తి వివ‌రాల‌ను పాఠశాల విద్యాశాఖ పొందిప‌రిచారు. తెలంగాణ‌తో  పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దసరా సెల‌వులు త‌క్కువ‌గానే ఉన్నాయి.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఈ సారి త‌గ్గిన సెల‌వులు..
క్రిస్మస్‌ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి.

☛ School & Colleges Holiday list in September 2023 : సెప్టెంబ‌ర్‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

ts schools and colleges list

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

Published date : 12 Sep 2023 08:22AM

Photo Stories