Skip to main content

Employment: ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు వైపు కూడా..

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. శుక్రవారం జరిగిన కాన్ఫరెన్స్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరిన్ని వివరాలను కూడా తెలిపారు ఆయన..
Collector Pamela Sorders about Youth Employment

 

కరీంనగర్‌ అర్బన్‌: ప్రైవేటు పరిశ్రమలు, విద్యాసంస్థల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు వారధి సొసైటీ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్లో వారధి సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. నిరుద్యోగ యువతకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, పలు అంశాలపై కలెక్టర్‌ చర్చించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

Freshers Day: న్యాయ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

జిల్లాలో అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు ఐటీ టవర్‌ ఉందని, పరిశ్రమల జీఎం, వారధి సొసైటీ కలిసి నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించే అంశంపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు ఉద్యోగాలపై యువత దృష్టి సారించాలని సూచించారు. పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, సమగ్రంగా శిక్షణ అందించాలని, ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. ఇందుకు అనుగుణంగా మరోచోట లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Student Deepika: రాష్ట్ర స్థాయిలో విద్యా‍ర్థినికి ప్రథమ స్థానం

ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగాల నియామకం కోసం జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్‌ చైర్మన్‌గా, కన్వీనర్‌గా జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారధి సొసైటీ మెంబర్‌ సెక్రటరీ ఆంజనేయులు, జెడ్పీ సీఈవో శ్రీని వాస్‌, డీఈవో జనార్దన్‌ రావు, డీఐసీ జీఎం నవీన్‌కుమార్‌, మెప్మా పీడీ రవీందర్‌, డీఆర్‌డీఓ శ్రీధర్‌, ఎస్సీ డెవలప్‌మెంట్‌ డీడీ నతానియల్‌, బీసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ అనిల్‌ ప్రకాష్‌ కిరణ్‌, ఎంప్లాయీమెంట్‌ ఆఫీసర్‌ దేవేందర్‌ రావు, ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

World Meteorological Day: ప్రపంచ వాతావరణ దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్ ఇదే..

Published date : 23 Mar 2024 05:19PM

Photo Stories