Skip to main content

Student Deepika: రాష్ట్ర స్థాయిలో విద్యా‍ర్థినికి ప్రథమ స్థానం

తన ఇంగ్లీష్‌ సామర్థ్యంలో ముందు నిలిచింది ఈ విద్యార్థిని. మండలంలోని ఎంపీపీఎస్‌ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థిని ఆ గ్రామ సర్పంచ్‌ తదితరులు అభినందించారు..
Student Deepika achieves first prize in english ability   Sarpanch Nayakam Bhagyavathy expressing admiration for Deepika's talent.

ముంచంగిపుట్టు: రాష్ట్ర స్థాయిలో ఇంగ్లిష్‌ సామర్థ్యంలో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థిని దీపిక ప్రతిభను చూసి దాసోహం అయ్యానని జర్రెల పంచాయతీ సర్పంచ్‌ నాయకం భాగ్యవతి అన్నారు. మండలంలో గల కుమడ పంచాయతీ చీపురుగొంది ఎంపీపీఎస్‌ పాఠశాలను సర్పంచ్‌ భాగ్యవతి, వైఎస్సార్‌సీపీ నేతలు సురేష్‌, తిరుపతి తదితరులు శుక్రవారం సందర్శంచారు.

World Meteorological Day: ప్రపంచ వాతావరణ దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్ ఇదే..

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన ఈ పాఠశాల విద్యార్థిని దీపిక, ఉపాధ్యాయుడు హనుమంతరావులను వారు అభినందించారు. ఈ సందర్భంగా దీపికకు ట్యాబ్‌, స్కూల్‌ బ్యాగ్‌, స్టడీ మెటీరియలు అందించారు. దీంతో పాటు 19 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదవి ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుడు హనుమంతరావును అభినందించారు. పూర్ణారావు, పూర్ణమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Job opportunities: న్యాయ సేవా సంస్థ డిఫెన్స్‌ కౌన్సిల్‌లో ఉద్యోగావకాశాలు

Published date : 23 Mar 2024 04:31PM

Photo Stories