SAP Restructuring Plan: సాఫ్ట్‌వేర్ కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాలకు ఎసరు.. ఎంత మంది ఉద్యోగాలు కోల్పోనున్నారంటే..

ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది. దీంతో దాదాపు 8,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు.
పునర్నిర్మాణ ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవు కార్యక్రమాలు, అంతర్గత రీ-స్కిల్లింగ్ చర్యల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఎస్‌ఏపీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా 2023 డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,07,602 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నట్లు ఎస్‌ఏపీ వివరించింది.
కంపెనీ నాలుగో త్రైమాసిక ఐఎఫ్‌ఆర్‌ఎస్ (International Financial Reporting Standards)యేతర ఆదాయంలో 5 శాతం లాభాన్ని నమోదు చేసినట్లు ఎస్‌ఏపీ విడిగా పేర్కొంది. దీంతో ఈ ఆదాయం 8.47 బిలియన్ యూరోలకు (రూ.76 వేల కోట్లు) చేరినట్లు తెలిపింది. అలాగే క్లౌడ్ సేల్స్ 20 శాతం పెరిగి 3.7 బిలియన్ యూరోలకు (రూ.33 వేల కోట్లు) చేరినట్లు వెల్లడించింది.